ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు, నిర్మాతలు, నటులు ఆదివారం సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. తాజా రాజకీయ పరిణామాల మధ్య సినీ పరిశ్రమ నేతలు ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపడం చర్చనీయాంశంగా మారింది.తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలిసింది లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ను మాత్రమే కలిశారు. అయితే, ఇటీవల థియేటర్ల బంద్‌కు సంబంధించిన విషయంపై స్పందించిన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సినీ ప్రముఖులు ఒక్కసారైన సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని థియేటర్‌ల పరిస్థితిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేశారు.
భేటీకి ప్రాధాన్యం
అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) లను సినీ ప్రముఖులు కలవనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లయినా ఏపీలో అంతంత మాత్రంగానే సినీ ఇండస్ట్రీ ప్రభావం ఉంటుంది. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏమి కోరతారనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. చంద్రబాబు సూచన మేరకు సినీ ప్రముఖులకు మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ చేసి ఆహ్వానం పలికారు.

అవకాశాలు
ఈ భేటీకి మొత్తం 35 నుంచి 40 మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) ప్రత్యేకంగా భేటీ కానున్నారు.అయితే సీఎం చంద్రబాబుతో కలిసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉండగా, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు ఉన్నారు. వీరితో పాటు నటులు బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని ఉన్నారు.
Read Also: AP School Students: ఏపీ విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్ పాస్‌లు