हिन्दी | Epaper

CITU: మంగళం డిపోను ప్రైవేటు సంస్థకు అమ్మే హక్కు ఎవరిచ్చారు?

Tejaswini Y
CITU: మంగళం డిపోను ప్రైవేటు సంస్థకు అమ్మే హక్కు ఎవరిచ్చారు?

CITU: 100 కోట్ల రూపాయల విలువచేసే మంగళం డిపోకు చెందిన పది ఎకరాల స్థలాన్ని పూలేకి చెందిన పినాకిల్ సంస్థకు అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ప్రశ్నించారు. మంగళవారం నాటి ఉదయం మంగళం డిపోను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర, కోశాధికారి ఈఎస్ కుమార్ లతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

Read Also: YS Jagan DA Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

రాష్ట్రంలో దాదాపుగా 20వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీకి సంబంధించిన స్థిర ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, కార్మికులంతా ప్రజల మద్దతుతో ఐక్య పోరాటం చేస్తే భవిష్య తరాలకు ఆర్టీసీ ఆస్తులను నిలిపిన వారమౌతామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి కార్మికులకు పిలుపునిచ్చారు.

CITU: Who gave the right to sell Mangalam Depot to a private company?
CITU: Who gave the right to sell Mangalam Depot to a private company?

పర్యావరణహితం పేరుతో ప్రజా రవాణా వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులచే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చిన ప్రభుత్వం, నేడు ఆ ఎలక్ట్రిక్ బస్సులకు సౌకర్యాల పేరిట ప్రభుత్వ వినియోగంలో ఉన్న డిపోలను, గ్యారేజీలలో సగభాగాన్ని పూణెకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పినాకిల్ కు దాదాపు 100 కోట్ల విలువైన మంగళం డిపోను దారాదత్తం చేయడానికి ప్రభుత్వం మార్గ నిర్దేశకాలు ఇచ్చిందన్నారు. భవిష్య తరాలకు, వందల మంది కార్మికులకు ఉపాధి నిచ్చే ఇటువంటి డిపోలను అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రైవేటుపరం చేయడం సమంజసం ఎంత మాత్రమూ కాదన్నారు.

ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం ద్వారా దశలవారీగా 3 వేల బస్సులను ఏర్పాటు చేయడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా… వేల కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలకు చెందిన స్థలాలను ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందన్నారు. ఈ-బస్ డిపోల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించుకోకుండా ఉపయోగంలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను ఇవ్వడం పట్ల ప్రభుత్వ తీరుపై కందారపు మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో నెంబర్ 88 ద్వారా 2029 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సు(Electric bus)లను నడపడానికి ప్రభుత్వం దృష్టి సారించిందని, కానీ ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది కార్మికులు రోడ్డున పడతారని, గతంలో టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్ ను కాపాడుకోవడానికి సిఐటియు ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు పోరాటం చేశామని, ఐక్య పోరాటం లేని కారణంగానే ఆ వర్క్ షాపు వేరొక ప్రాంతానికి తరలించేశారన్నారు.

కూటమి ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రిక్ ఈ-బస్సు డిపోల ఏర్పాట్లలో భాగంగా డిపోలో పనిచేసే వారితో పాటుగా డిపోలు ఉన్న ప్రాంతంలో వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.

సంఘటిత పోరాటమే మార్గం

కార్మిక సంఘాలు, డిపోల యూనియన్లు అన్నీ కలిసి ఒక్కతాటిపైకి వచ్చి ప్రైవేటుపరం కాబోతున్న ప్రజలకు సంబంధించిన ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడడానికి కార్మికులు చేసే పోరాటానికి పూర్తిస్థాయి మద్దతు సిఐటియు తరపునఅందిస్తూనే కార్మికుల వెంట నిలబడి పోరాడుతుందన్నారు.

ఈ సందర్శన కార్యక్రమంలో ఎస్డబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ఎస్ మన్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఎస్ డబ్ల్యుఎఫ్ మంగళం డిపో అధ్యక్షులు వి.మురళి, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ఎస్.రెడ్డప్ప, మంగళం డిపో సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

ఆదాయాలు తగ్గినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాము

📢 For Advertisement Booking: 98481 12870