చిత్తూరు (Chittoor) జిల్లాలోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సంక్రాంతి పండుగ వేళ ఊరట కలిగించే నిర్ణయాన్ని జిల్లా విద్యాశాఖ తీసుకుంది. జిల్లా (Chittoor) లోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ నెల 13వ తేదీ శనివారం నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు మంజూరు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డీఈవో రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఇచ్చే సెలవుల నేపథ్యంలో,
Read Also: AP: మడ అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

ప్రత్యేక తరగతులకు సైతం సెలవులు
ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: