हिन्दी | Epaper

బడ్జెట్ లో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు

Vanipushpa
బడ్జెట్ లో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు

ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమం – అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసారు. బడ్జెట్ ప్రతిపాద నలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 3.24 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనల ను సభకు ముందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ నిధుల కేటాయింపులు చేసారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు కేటాయించినట్లు సమాచారం.
తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్
3.24 లక్షల కోట్ల అంచనాతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీ లో ప్రవేశ పెడుతున్నారు. దాదాపు 3 లక్షల 24 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్ట నున్నట్లు సమాచారం. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ సమర్పిస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు కేశవ్ బడ్జెట్ ప్రతులను అందించారు.

బడ్జెట్ లో చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు


బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ హామీలకు నిధులు
సంక్షేమానికి నిధులు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేసారు. బడ్జెట్ ప్రతులతో అమరావతి లోని వెంకటాయపాలేనికి వెళ్లిన ఆర్థికమంత్రి పయ్యావుల అక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం నిధుల కేటాయింపు చేసినట్లు సమాచారం.

మూడు విడతల్లో రైతు భరోసా

మూడు విడతల్లో రైతు భరోసా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతలుగా వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలుకు వీలుగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు సమా చారం. అదే విధంగా తల్లికి వందనం పథకాన్ని మే మాసంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం పథకం నిర్వహణ అంచనాలకు తగిన విధంగా కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు పైన బడ్జెట్ లో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ ప్రతిపాదన పూర్తయిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం కానున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

వడగాల్పుల ముప్పు: రాబోయే 4 రోజులు జాగ్రత్త!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్

📢 For Advertisement Booking: 98481 12870