ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర(Tirupati Gangamamba Jathara)లో పాల్గొననున్నారు. ఈ జాతరలో చివరి ఘట్టంగా అమ్మవారి విశ్వరూప దర్శనం జరగనున్న సందర్భంగా సీఎం తన అధికారిక పర్యటనలో భాగంగా అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుగుతుంది.
రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకుంటారు
ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు, సీఎం చంద్రబాబు ద్రవిడ యూనివర్సిటీ గ్రౌండ్కు హెలికాప్టర్లో చేరనున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకొని గంగమాంబ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని అధికారులు తెలిపారు. గంగమాంబ జాతరకు విస్తృత సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు.
కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈ పర్యటన కోసం ప్రాంతీయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సమాచారం. భక్తుల రద్దీతోనూ, ముఖ్యమంత్రి పర్యటనతోనూ కుప్పం పట్టణం సర్వంగా ఉత్సాహవంతంగా మారింది. గంగమాంబ జాతర అనేది స్థానిక ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర ఉత్సవం కావడంతో, సీఎం పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also : Saiyami Kher : కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన సయామీ ఖేర్