हिन्दी | Epaper

Chandrababu Naidu: ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పి కొట్టాలి

Rajitha
Chandrababu Naidu: ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పి కొట్టాలి

ఎన్డీయె శాసనసభా పక్ష సమావేశంలో సిఎం చంద్రబాబు దిశానిర్దేశం

విజయవాడ : ప్రత్యర్థుల పన్నాగాలను కూటమీ పక్షాలు సంఘటితంగా తిప్పి కొట్టాలని సీఎం చంద్రబాబు (chandrababu naidu) అన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సభలో ఆవు కథలు చెప్పడం మానేసి, విషయ అవగాహనతో రావాలని నిర్దేశించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ నమోదు చేసుకుంటానని చెప్పారు. 3 నుంచి 7నిమిషాల్లో స్పష్టంగా విషయం చెప్పాలని మార్గనిర్దేశం చేశారు. తనకు క్వాంటం పరిజ్ఞానం లేకపోయినా, దాని ప్రయోజనాలు బాగా తెలుసన్నారు. సాంకేతికత మార్పులను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని సభ్యులకు సూచించారు. రాష్ట్రంలో 1.60 లక్షల మంది క్వాంటం కోర్సులకు దరఖాస్తు చేసుకోవడం కొత్త టెక్నాలజీపై యువత ఆసక్తికి నిదర్శనమన్నారు. మద్రాస్ ఐఐటీలో క్వాంటం కోర్సుకు 2.5 లక్షల మంది దరఖాస్తులు వస్తే అందులో లక్షా 10 వేల మనవాళ్లవే ఉన్నట్లు గుర్తుచేశారు.

Read also: Andhra Pradesh: అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

Opponents' plans must be thwarted

Opponents’ plans must be thwarted

సర్కార్ వచ్చాక లక్ష కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారుల పనులు, రూ.90 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలన్నింటినీ రాష్ట్రం అందిపుచ్చుకోవాలన్నారు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.450 కోట్ల నష్టంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నింటినీ అధిగమించి రూ.54 కోట్ల లాభల్లోకి రావడం శుభపరిణామం అన్నారు. అన్నిమతాలను గౌరవించాలని, ఎవరి విశ్వాసాలను దెబ్బతీయకూడదని సీఎం స్పష్టంచేశారు. జగన్ కు మతాలపై గౌరవం లేనందునే వైఎస్సార్సీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగిన విషయం ప్రస్తావించారు. తిరుమల సహా వీలైన ప్రతి ఆలయంలో ప్రసాదాలను కల్తీ చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో లేకపోతే ఫలితాలు రావు విశ్వాసం పెంచుకుని శాశ్వతంగా రాజకీయాల్లో ఉండేలా కూటమి ఎమ్మెల్యేలు మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. మనం పూర్తిగా కోలుకున్నాం అనుకోవద్దు.

ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి

కానీ వ్యవస్థలను గాడిన పెట్టామని తెలిపారు. దీన్ని అంతా సానుకూలంగా తీసుకుని కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తించి తనకు ఇస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో లేకపోతే ఫలితాలు రావని అన్నారు. నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందని అన్నారు. కేంద్రం అమరావతి, పోలవరానికి నిధులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదని తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కారణం కేంద్ర సాయమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర సాయంతో నిలబెట్టామన్నారు. కేంద్ర సాయంతో మొదటి సారి రూ.54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించింది. 20 నెలలుగా కొనసాగుతున్న కూటమి ఐక్యతను కాపాడుకోవాలని కిందిస్థాయిలోనూ ఇదే ఐక్యత ఉండాలని అన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ, అందరం ఒక్కటే అనే భావనతో మెలిగేలా చూసుకోవాలి అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

విద్యే సాధికారతకు మూలం: గవర్నర్

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

స్మార్ట్ పోలీసింగ్‌తో నేరాలకు అడ్డుకట్ట:అజిత వేజెండ్ల

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యం:హిమాన్షు శుక్లా

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

📢 For Advertisement Booking: 98481 12870