हिन्दी | Epaper

Chandrababu Naidu: పాలన మరింత సరళం

Rajitha
Chandrababu Naidu: పాలన మరింత సరళం

విజయవాడ : పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. టెక్నాలజీ అనుసంధానంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగా ప్రతీ ప్రభుత్వ శాఖ సన్నద్ధం కావాలని.. సులభతర మైన పౌర సేవల్ని అందించాలని సీఎం సూచించారు.

Read also: Andhra Pradesh: ఆర్థికసంఘం నిధులపై ఆంక్షలు తొలగించాలి

Governance is more simple

Governance is more simple

టెక్నాలజీ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోకూడదని.. ఆటోమేషన్ దిశగా అడుగులు సేవల కోసం కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువచేయడమే లక్ష్యం రియల్ టైమ్ గవర్నెన్స్ పై సిఎం చంద్రబాబు సమీక్ష వేయాలన్నారు. ప్రజల్లో డిజిటల్ లిటరసీ పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వంలోని 8.20 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణా సామర్ధ్యాలను మరింత మెరుగు పరుచుకునేలా వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకోవాలన్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ కోర్సులను అందించాలని సీఎం సూచించారు. వార్షిక నివేదికల్లోనూ సామర్ధ్యాన్ని ప్రతిఫలించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బిల్ గేట్స్ పర్యటన సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఇచ్చిన ప్రజెంటేషన్లు అద్భుతంగా ఉన్నాయని ఆయన అధికారులను అభినందించారు.

సంక్షేమ పథకాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి

డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, పీపుల్స్ పర్సెప్షన్, ఏజెంట్ స్పేస్ ఏపీఏఐ సెర్చ్ బార్, సంజీవని, అమరావతి ప్రాజెక్టులపై చూపిన ప్రజెంటేషన్లు బిల్ గేట్ను కూడా ఆకట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేపట్టే ప్రాజెక్టులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో అమలవుతున్న అత్యుత్తమ ప్రమాణాల్ని అన్నింటా అనుసరించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజల నుంచి మంచి అభిప్రాయం వ్యక్తం అవుతుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అన్నా క్యాంటీన్లలో వడ్డించే ఆహారాన్ని మరింత రుచికరంగా ఉండేలా చూడాలని సీఎం సూచనలు చేశారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక బెస్ట్ హాస్టల్ మోడల్గా తీసుకుని మిగిలిన వాటిలోనూ అవే ప్రమాణాలను పాటించేలా చూడాలన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నేరాల రేటును తగ్గించే అంశంలో పోలీసు విభాగం తమ పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించాలన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యల్ని ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని హోంశాఖ అధికారులను ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870