- మంత్రులు బి.సి. జనార్దన రెడ్డి, అచ్చెన్నాయుడు
సచివాలయం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పట్టుదల, చిత్తశుద్ధికి ప్రతీకగా తీకగా ఆవిర్భవించిన మహత్తర ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని రాష్ట్ర మంత్రులు బి.సి. జనార్ధన రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం దిశగా తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాలలో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటన్నారు. ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ సిఎం చంద్రబాబు నాయుడే అని వారు పునరుద్ఘాటించారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఇరువురు మంత్రులు పాత్రికేయులతో మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర ప్రాంతానికి పారిశ్రామిక, ఆర్థిక, పర్యాటక రంగాలలో విస్తృత అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఆలోచించి ప్రారంభించారన్నారు.
Read also: AP: కోనసీమలో భారీ అగ్నిప్రమాదం.. అప్రమత్తం అయిన ప్రభుత్వం

Chandrababu is the doer, the deed, and the action behind the Bhogapuram airport
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలకు సమాన దూరంలో ఉండే భోగాపురం ప్రాంతాన్ని ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మించాలనే దూరదృష్టితో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖపట్నం విమానాశ్రయం నావీ పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో పాటు నగర మధ్యలో ఉండటంతో భవిష్యత్తులో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను తీర్చడం అసాధ్యమవుతుందని గ్రహించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టండం జరిగిందన్నారు. అయితే 2019లో ప్రభుత్వ మార్పు తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లు నిలిచిపోయాయన్నారు. నిరక్ష ్యం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విలువైన సమయం వృథా అయిందన్నారు. అయితే 2024 లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ముందుకు
తీసుకువెళ్లడం జరిగిందన్నారు.
ప్రధానమంత్రి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లడం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా తీసుకున్న శ్రద్ద ఫలితంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని సాంకేతిక, పరిపాలనా అనుమతులు వచ్చాయని వివరించారు. ఫలితంగా కేవలం 18 నెలల్లోనే 95శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ, రన్వే, టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, లాజిస్టిక్స్, ఎంఆర్ వంటి అన్ని విభాగాల పనులు పూర్తి అయ్యాయన్నారు. 2026 జనవరి 4న తొలి ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతమై రాష్ట్ర అభివృద్ధికి కొత్త మైలురాయిగా నిలిచిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గర్వకారణంగా నిలుస్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు, పర్యాటకం, ఉపాధి అవకాశాలు విసృతంగా మెరుగు పడతాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: