हिन्दी | Epaper
ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్

Bommanahal MPP election : నాటకీయంగా బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక | టీడీపీ కైవసం

Sai Kiran
Bommanahal MPP election : నాటకీయంగా బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక | టీడీపీ కైవసం

Bommanahal MPP election : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరింది. ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణి మెజారిటీ సాధించి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

గతంలో ఎంపీపీగా ఉన్న పద్మ రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ పదవికి ఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేకాధికారిగా తహసీల్దార్ గంగాధర్మను నియమించగా, ఆయనతో పాటు ఎంపీడీఓ విజయభాస్కర్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

ఈ ఎన్నికలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ హాజరయ్యారు. మండలంలో మొత్తం 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, 15 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

ఎంపీపీ పదవికి ఆశపడ్డ ఉదేహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు కరూరు కల్పనతో పాటు మరో ఏడుగురు ఎంపీటీసీ సభ్యులు ఓటింగ్‌కు దూరంగా వెళ్లారు. మిగిలిన (Bommanahal MPP election) ఏడుగురు సభ్యులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణికి మద్దతుగా చేతులు ఎత్తారు. దీంతో ఆమె మెజారిటీ సాధించినట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి గంగాధర్మ ప్రకటించారు.

Bommanahal MPP election
Bommanahal MPP election

విజయం సాధించిన అనంతరం ముల్లంగి నాగమణికి ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. దర్గాహొన్నూరు-1 ఎంపీటీసీ సభ్యురాలు నాగరత్నమ్మ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.

ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహళ్ ఎస్ఐ నబీరసూల్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

కొొందరు ఎంపీటీసీలు హైడ్రామా

మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు హైడ్రామాకు దిగారు. కోరమ్‌లో పాల్గొని ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత బహిష్కరణ అంటూ బయటకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

కొంతమంది ఎంపీటీసీలు చివరి నిమిషంలో ముల్లంగి నాగమణికి మద్దతు ఇవ్వడంతో ఫలితం మారిందని వైస్ ఎంపీపీ రమేష్, ఎంపీటీసీ సభ్యులు కల్పన, శివశరణమ్మ తదితరులు ఆరోపించారు. తమ ఎంపీటీసీ సభ్యుడిని దాచిపెట్టారని, చివర్లో వదిలిపెట్టారని వారు మండిపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870