हिन्दी | Epaper

Bill Gates: ‘గ్రేట్ వర్క్’ అంటూ చంద్రబాబుకు అభినందనలు

Saritha
Bill Gates: ‘గ్రేట్ వర్క్’ అంటూ చంద్రబాబుకు అభినందనలు

Bill Gates: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సీఎం చంద్రబాబుతో (Chandrababu) కలిసి సందర్శించారు. ఆర్టీజీఎస్ సెంటర్‌లో ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాల గురించి బిల్ గేట్స్ కు చంద్రబాబు వివరించారు.

Read Also: Bill Gates: అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీలో కీలక చర్చలు

Bill Gates: 'గ్రేట్ వర్క్' అంటూ చంద్రబాబుకు అభినందనలు
Bill Gates: Congratulations to Chandrababu Naidu for great work

ప్రాపర్టీ రికార్డుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి విధానాలు అమలు చేస్తున్న తీరును గేట్స్ ప్రశంసించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు సేకరించి ప్రజలకు సలహాలు ఇస్తున్న విధానాన్ని గ్రేట్ అని కొనియాడారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలను తీసుకుంటున్నట్టు బిల్ గేట్స్ కు చంద్రబాబు తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రికార్డులను భద్రపరుస్తున్నామని, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ఆయనకు వివరించారు. అమరావతి నిర్మాణ వివరాలను కూడా ఆసక్తిగా తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870