పల్లెలే దేశానికి పట్టు గొమ్మలు, స్థానిక స్వపరిపాలన ద్వారానే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. తద్వార దేశ సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు ఏర్పడతాయి. భారత దేశ ఆత్మ పల్లెల్లోనే వుంది. రాజకీయాలకు అతీతంగా గ్రామాలకు ఎన్నికలుజరిపి ఆయా గ్రామాలలో ప్రజల సర్వతో ముఖాభివృద్ధికి నిస్వార్థ సేవతో కృషి చేసే సామర్థ్యంతో పని చేయాలని భావించే నాయకులనే (Leaders)ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రజలకు స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన రాజ్యాంగ సంస్థ అయినఎన్నికల కమిషన్ కల్పించిన విషయం బహిరంగ రహస్యమే. ఆ ఎన్నికల ప్రక్రి యలో భాగంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల జాతర కోలాహలంగా కొనసాగుతోంది. సదరు ఎన్నికల్లో వేలం పాటలతో విజేతల ఎంపిక జరగ కుండా, సమర్థులైన అభ్యర్థులను పోటీలకు ఆహ్వానించాలి. వారిలో అత్యంత సమర్థులైన వ్యక్తులనే తమ గ్రామాలకు సర్పంచులుగా, తమ వార్డులకు సభ్యులుగా ఎన్నుకునే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించాలి. ఏక గ్రీవాల ద్వారా ఆయా గ్రామాల ప్రజలందరికీ ఆమోదయోగ్యుడైన నిజాయితీ, నిబద్ధత గల నాయకులు (Leaders)ఎన్నిక జరిగితే అది అభినందనీయమే. ఐతే అది జరుగుతుందా? అనేది మిలి యన్ డాలర్ల ప్రశ్నగా భావించక తప్పదు. నిజానికి అలా జరిగినప్పుడే సమర్థ నాయకత్వం లభించి వారి నేతృత్వంలో పంచాయతీలు ప్రగతి పథంవైపు పరుగులు పెడతాయని చెప్పక తప్పదు.
Read Also: http://Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రెడీ

పంచాయతీల ఎన్నికలు
తెలంగాణలోని గ్రామాలలో కొనసాగుతున్న పంచాయతీల ఎన్నికల్లో డబ్బులున్న వారే తమ ఐదేళ్ల పదవీకాలంలో ఓ యాభై లక్షలతో లేదా కోటీ, రెండు కోట్ల రూపాయలతో ఆయా గ్రామాలలో గుడులూ చర్చీలు, మసీదులూ, కమ్యూనిటీ హాల్స్, అంతర్గత రోడ్ల నిర్మాణం, రక్షిత మంచినీటి సదుపాయాలు లాంటి సౌకర్యాలను సమ కూరుస్తామనే హామీలతో గ్రామాలలో ప్రజలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఏకగ్రీవాలకు తెరదీస్తుండడం గమ నార్హం. ఈ క్రమంలో ఒకవేళ పోటీ ఏర్పడితే వేలంగా మార్చి అధిక మొత్తం చెల్లిస్తామన్న వారే పదవులను చేజిక్కించు కుంటున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. బెదరింపు లూ, బలప్రయోగాలు సైతం ఏకగ్రీవాలకు కారణమోతున్నా యనే వాదనలు కూడ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికలలో 395, రెండో విడతలో 415 ఏకగ్రీవాలు ఎలాంటి ప్రలోభాలకు, బల ప్రయోగాలకు, ఒత్తిళ్లకు, బెదిరింపులకు తావు లేకుండా పూర్తి ప్రజాస్వామ్య యుతంగా జరిగినవేనని ఎన్నికల కమిషన్ చెబుతున్న వైనం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమోతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ననుసరించి ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా తమపార్టీ ఎన్నికల గుర్తు తో ప్రత్యక్షంగా ఈ ఎన్నికలలోపాలుపంచుకోవడానికి వీల్లేదు. ఈ స్పూర్తికి విరుద్ధంగా ప్రాంతీయ, జాతీయ పార్టీల నే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఈ ఎన్నికల సమరంలో పాలుపంచుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులను వెచ్చిస్తూ ఏకగ్రీవాల రూపంలో వేలం పాటల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటున్న వైనంతో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికి భంగం కలుగుందనే బుద్ధిజీవుల అభిప్రాయం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. తద్వారా ధనస్వామ్యం చేతుల్లో ప్రజాస్వామ్యం బందీగా మారుతుందేమోననే భావన సర్వత్ర వెల్లువెత్తుతోంది.
ఏకగ్రీవాలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(జి) స్థానిక స్వపరిపాలన ఉద్దేశ్యంపరిపాలన, రాజకీయ, సాంఘిక సమానత్వాన్ని సాధించడం అనే నిర్దేశాన్ని బడా నేతలు, పెత్తం దారులు తోసి రాజంటూ ధన, కుల, మత ప్రమేయంతో పెద్దఎత్తున ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుండడం ఎన్నికలలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమే. ఈ చర్యలు అధికార, విపక్ష పార్టీల నేతల సూచనలతోనే ముందుకు సాగుతున్నవైనం బహిరంగ రహస్యమే. ఫలితంగా స్థానిక స్వపరిపాలన డబ్బులున్న వారి చేతుల్లో బందీగా మారుతుందనేది నిర్వివాదాంశమే. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ప్రభుత్వం, న్యాయవ్యవస్థ నివారించాలంటే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించాల్సిందేననేది న్యాయ నిపుణుల నిశ్చితాభిప్రాయం. పార్టీల సంస్థాగత ఎన్నికల తంతే ఇక్కడ కొనసాగుతోంది. విశాలమైన ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు స్వేచ్ఛ సమానత్వ సాధనకు సంబంధించి రాజ్యాంగ నిబంధనల స్ఫూర్తితో ధన, కుల, మత, వర్ణ, వర్గ విచక్షణకు అతీతం గా ప్రజల సమాన అభివృద్ధి కోసం ముందుకు సాగే లక్ష్యం తోనే మా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు, వారి పార్టీల నిర్మాణానికి సంబంధించిన సంస్థాగత ఎన్నికలలో మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తిని తోసిరాజంటూ కోట్ల రూపాయల సంపదతో పాటు, కులాలను, మతాలను, వర్ణాలను, వర్గాలనే బలమైన ప్రాతి పదికలుగా భావిస్తూ సీల్డ్క్వర్ ద్వారానే నాయకుల ఎంపికకు పూనుకుంటున్నారు.
పార్టీల నియమావళి ప్రకారం ఎన్నికల తంతుని తూతూ మంత్రంగానే కొనసాగిస్తున్నాయి. ఆ అలవాటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలకు, వేలం పాటలకు ఊపిరులూదుతు న్నదేమోననే భావన కలుగుతుంది.

నిజాయితీ పరులైన ..
రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ధన, కుల, మత, వర్ణ, వర్గ విచక్షణకు ఆస్కారమే లేకుండా ప్రజలు తమ ఓటు హక్కులను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ దే. అందులో భాగంగా మాడల్ కోడ్ మానిటరింగ్ ఆఫీసర్ల నియామకంతో పాటు స్ట్రాటజిక్ సర్వేయలెన్స్ టీమ్ ఏర్పా టుకు అదనంగా మొబైల్ టీమ్లతో, వ్యయ పరిశీలకుల నియామకంతో నిరంతరపర్యవేక్షణలో వివిధ రకాల ఎన్నికల అక్రమాలను, ప్రలోభాలను అరికట్టే చట్టపరమైన బాధ్యత లను నిర్వర్తించే క్రమంలోఎన్నికల విధినిర్వహణలో భాగంగా మంత్రులూ, ముఖ్యమంత్రుల కాన్వాయ్లను సైతం ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నప్పటికీ ప్రలోభాల వరదలో ఎన్నికల నియమాలు కొట్టుకుపోకుండా ఆపలేకపోతున్నాయే మోనని పరిశీలకులనుకుం టున్నారు. ఒకాయన ఐదేళ్ల పాటు ఫ్రీ కేబుల్, ఉచిత వైఫై సదుపాయాలను కల్పిస్తానంటు న్నాడు. మరోగ్రామంలో ఐదేళ్లపాటు ఉచితంగా క్షవరంచేస్తా నని హామీ ఇస్తున్నాడు. ఎంత మంది నిజాయితీ పరులైన అభ్యర్థులను తమ ప్రజా ప్రతినిధులుగా ఎంపిక చేసుకుని తమతమ గ్రామాలలో వారికి అధికారాన్ని అప్పగించి గ్రామ స్వరాజ్యస్థాపన కోసం ఊపిరులూదడానికి ఓటర్లుగా తమ వివేకాన్ని ప్రదర్శిస్తారో? లేదా ప్రలోభాల వలలో చిక్కుకుని తమ ఐదేళ్ల భవిష్యత్ని చేతులారా తామే కాలరాచుకుంటా రో? రాబోయే ఎన్నికల ఫలితాలే తేల్చి చెప్పాల్సి వుంది.
-డాక్టర్ నీలం సంపత్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: