ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) భక్తుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 22న ‘అరుణాచలం యాత్ర’ (Arunachalam Yatra) పేరిట నాలుగు రోజుల పుణ్యయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భక్తులు మూడు ప్రముఖ దేవాలయాలను సందర్శించే అరుదైన అవకాశం పొందనున్నారు.నాలుగు రోజుల ఈ యాత్రలో మూడు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.కాణిపాకం, అరుణాచలం, తిరుపతి క్షేత్రాలను చూసేలా ప్లాన్ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఈ ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో అధికారులు యాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ అరుణాచలం యాత్ర కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ బస్సులో పుష్‌బ్యాక్ సీట్లు, టీవీ సౌకర్యం ఉన్నాయన్నారు.ఈ బస్సు 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం డిపో నుంచి బయలుదేరుతుంది.
అధికారులు తె
యాత్రలో భాగంగా కాణిపాకంలో మహాగణపతి ఆలయం దర్శనం ఉంటుంది. తరువాత అరుణాచలంలో అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది. చివరగా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని (Tirumala Venkateswara Swamy Temple) దర్శించుకునే అవకాశం ఉంది. ఈ యాత్రకు ఒక్కొక్కరికి బస్సు టికెట్ ధర రూ.3,500గా నిర్ణయించారు. టికెట్ ధరలో అల్పాహారం, టీ, భోజనం ఖర్చులు ఉండవు. ఎవరైనా మార్గ మధ్యలో గదులు తీసుకోవాలనుకుంటే ఆ ఖర్చు కూడా యాత్రికులే భరించాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

యాత్రకు వెళ్లాలనుకునేవారు
ఆర్టీసీ కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. అరుణాచలం యాత్రకు వెళ్లాలనుకునేవారు టికెట్ల కోసం ఆర్టీసీ డిపోలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం 95023 00189, 99666 66544, 98660 45588 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ అధికారులు ఏపీలోని వివిధ డిపోలో నుంచి అరుచలానికి ప్రత్యేక ప్యాకేజీలో యాత్రను ప్లాన్ చేస్తున్నాయి. మూడు నుంచి రోజుల పాటూ ఈ యాత్ర ఉంటోంది. తాజాగా రాజమహేంద్రవరం డిపో నుంచి యాత్ర ప్రారంభంకానుంది.
Read Also: AP Mini bypass: ఆంధ్రాలో మరో మినీ బైపాస్