ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘స్త్రీ శక్తి‘ పేరిట తీసుకొచ్చిన ఈ పథకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభం కానుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం కలగనుంది.

రవాణా శాఖ ఉత్తర్వులు – మార్గదర్శకాలు విడుదల
ఉచిత ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలను రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ (Secretary Kantilal) దండే అధికారికంగా విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల్లో పథకం అమలుకు సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నడిచే ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free travel in buses) కల్పించనున్నారు. అవి: ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఈ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు తమ గుర్తింపు కార్డులను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఈ సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తించదు
ప్రభుత్వం పలు సర్వీసులకు ఈ పథకం వర్తించదని స్పష్టంగా తెలిపింది. అందులో ముఖ్యంగా: తిరుపతి–తిరుమల మధ్య నడిచే సప్తగిరి బస్సులు, నాన్‌స్టాప్ బస్సులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే అంతర రాష్ట్ర బస్సులు, సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, స్టార్ లైనర్,ఏసీ బస్సులు, ఈ సేవలపై ఉచిత ప్రయాణం వర్తించదు.
ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ పథకం అమలులో భద్రత అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే, బస్సు కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇది మహిళల భద్రతను మెరుగుపరచడంలో కీలకంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: