Nara lokesh news : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పదోన్నతుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు చివరకు శుభవార్త లభించింది. ప్రభుత్వం ఏకకాలంలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఏఆర్ఎస్ఐ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియ వేగంగా పూర్తయ్యింది. చాలా కాలంగా పదోన్నతులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు ఇటీవల ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.
సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారం చూపుతానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమోషన్ల ఫైల్‌ను ముందుకు తీసుకెళ్లారు.
Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే సివిల్, ఏఆర్ విభాగాలతో పాటు ఏపీఎస్పీ సిబ్బందికి కూడా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, తర్వాత ఎన్నికల నియమావళి అమలులోకి రావడం వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
గత ఐదేళ్లలో పలుమార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి లోకేశ్ జోక్యంతో ఈ ప్రక్రియ పూర్తి అయింది.
దీంతో సుమారు 300 కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సమస్యను త్వరగా పరిష్కరించిన మంత్రి లోకేశ్‌కు ఏపీఎస్పీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: