हिन्दी | Epaper

AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

Aanusha
AP: రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది.

Read Also: DyCM Pawan: Dy.CM ఆదేశాలతో AP అటవీ ప్రాంతాల్లో వన్యజంతు భద్రతా చర్యలు

గోధుమలను రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది

ఈ పథకాన్ని మొదట 26 జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యపట్టణాలు, నగరాల్లో అమలు చేయనున్నారు. ప్రతి రేషన్ కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని పంపిణీ చేయడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటోంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం నెలకు 1,838 టన్నుల గోధుమలను (AP) రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది. కేంద్రం కేటాయించిన గోధుమలను ఎఫ్‌సీఐ (FCI) ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ,

AP: Wheat flour available for Rs. 20 at ration shops
AP: Wheat flour available for Rs. 20 at ration shops

వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి, ప్రతి రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు ఈ పిండిని చేర్చి, జనవరి 1 నుంచి కార్డుదారులకు అందజేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే, వారి డిమాండ్‌ను బట్టి రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతి నెలా సబ్సిడీపై గోధుమ పిండిని సరఫరా చేసేందుకు పౌరసరఫరాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలో రేపు పిడుగులతో కూడిన వర్షాలు

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అంధ క్రికెటర్ దీపికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

గ్యాస్ కష్టాలకు చెక్.. 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి!

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

టీటీడీ విద్యాసంస్థల్లో విద్యా విప్లవం

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై పిడిగుద్దులు

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

బలహీన చట్టాలతో ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

రైతు రాజ్యంలో కౌలు రైతు ఎందుకు పరాయి?

📢 For Advertisement Booking: 98481 12870