हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

AP: తిరుపతిలో ‘రోప్ వే’ సంగతేమైందో!?

Saritha
AP: తిరుపతిలో ‘రోప్ వే’ సంగతేమైందో!?

తిరుపతి : అంతర్జాతీయంగా యాత్రాస్థలంగా గుర్తింపు పొంది అభివృద్ధిలో (AP) స్మార్ట్ సిటీగా పరుగులు తీస్తున్న తిరుపతి (Tirupati) నగరంలో యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటు కావాల్సిన ‘రోప్వే’ సంగతి ఏమైందనేది నగరంలోని మేధావుల్లో చర్చ మొదలైంది. దాదాపు రెండేళ్ళుగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఇప్పటివరకు అతీగతీ లేకపోయిందనేది మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకకేంద్రంగా కూడా తిరుపతి ఖ్యాతి చెందడంతో ఇక్కడ రోప్వే ఏర్పాటు అవసరం ఉందని ఇప్పటికే కేంద్రం గుర్తించింది. తదనుగుణంగా తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి కూడా ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి నివేదించారు. అయితే ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరుగుతుందే తప్ప ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. పైగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండటం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుం డటంతో తిరుపతి ఎంపి వైసిపికి చెందిన నేత. మరీ ఆయన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతాయనేది సందిగ్ధమే.

Read Also: AP: రేపు మంత్రులు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమావేశం

AP: తిరుపతిలో ‘రోప్ వే' సంగతేమైందో!?
What happened to the ‘ropeway’ project in Tirupati?

భక్తుల రాకపోకలకు సౌకర్యాలు కల్పించేందుకు రోప్‌వే ప్రణాళిక

తిరుపతి మీదుగా తిరుమలకు వస్తున్న యాత్రికుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతుండటం ఐదు లక్షల మంది నగర జనాభా దాటడం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాల కోసం ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో “రోప్ వే”ఏర్పాటు ఉందనేది అందరిలోనూ వ్యక్తమవుతున్న అభిప్రాయం. తిరుపతి నగరంలో నాలుగు కిలోమీటర్లు వరకు ఈ రోవ్వే తీసుకురావాలనే ఆశయంతో తిరుపతి ఎంపి డాక్టర్ మద్దిల గురుమూర్తి రెండేళ్ళ క్రిందటే జాతీయ రహదారుల లాజి స్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ముఖ్య నిర్వహణాధికారి ప్రకాష్ గౌర్ చర్చించారు. ప్రాజెక్టు తీసుకువచ్చే దిశగా కీలకంగా ముందుకు కదిలారు. ఈ అయితే పర్వత మాల పరియోజన కార్యక్ర మం క్రింద తిరుపతి నగరం లో ‘రోప్ వే’ ఏర్పాటు చేసే విషయం ఎంతవరకు సాధ్యమనే అంశంపై కూడా కేంద్ర బృందం పరిశీలించింది.

యాత్రాస్థలంగానే గాక పుణ్యక్షేత్రంగా తిరుపతి నగరం భాసిల్లు తుండటం, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిచెంద డంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు తమతమ కంపెనీలను ఏర్పాటుచేశాయి. ఐఐటి, ఐఐఎస్ఐఆర్, ఐదు ప్రధాన విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపవుతుండం వంటివి ఇక్కడ రోప్వే అవస రాన్ని తీసుకువస్తున్నాయి. రోజుకు సరాసరి లక్షమంది వరకు యాత్రికులు దేశ విదేశాల నుంచి తిరుపతికి వస్తున్నారు. తిరుపతికి సమీ పంలోని రేణిగుంట విమానాశ్రయం అంతర్జాతీ యంగా రూపుదిద్దుకోవడంతో విమానాల సంఖ్య, ప్రయాణీకుల రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తిరుపతి నగరం మీదుగా తిరుమ లకు వెళ్ళే భక్తులు కూడా రెట్టింపవుతున్నారు. అటు యాత్రికులు ఇటు నగరవాసులు సాఫీగా ప్రయాణానికి నూతన మార్గాలను అన్వేషించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.

ఇప్పటికే శ్రీనివాససేతు… తోడు ‘రోప్వే’

విస్తరిస్తున్న తిరుపతి నగరంతోబాటు పెరిగి పోతున్న నగరజనాభా, యాత్రికుల సంఖ్యకు తగ్గట్లు తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు తిరుచానూరు మార్గం నుంచి కపిలతీర్థం కూడలి సమీపం వరకు శ్రీనివాససేతు వారధి అందుబాటులో ఉంది. దీనివల్ల రేణిగుంట విమానాశ్రయం వెళ్ళే యాత్రికులు, ప్రముఖులు, కడప హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మహా నగరాలకు వెళ్ళే భక్తులు సులభంగా వారధిపై దూసుకెళుతున్నారు. ఇప్పుడు తిరుపతికి రోప్వే తీసుకువచ్చే దిశగా ఎంపి డాక్టర్ గురుమూర్తి కృషి ఎంతవరకు ఫలిస్తుందనేది ముందుముందు చూడాల్సిందే. ఈ రోవ్వే 4కిలోమీటర్లు వరకు ఎక్కడ నుంచి ఎక్కడకు ఏర్పాటుచేస్తారనేది కార్యాచరణ రూపొందించాలి. తిరుపతిలో రోప్వేకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసినా బడ్జెట్లో కూడా నిధులు ఊసేలేకపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870