- బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ : ఇరుసుమండలో జరిగిన బ్లో అవుట్ ప్రమాదం బాధితులందరిని ఆదుకుంటామని ఎపి సిఎం చంద్రబాబు వెల్లడించారు. బాధితులందరికి పరిహరం అందజేస్తామన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన బ్లో అవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సిఎం చంద్రబాబు (Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులను సంబంధిత అధికారులు సిఎంకు వివరించారు. గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు, ప్రజల రక్షణకు వివిధ విభాగాలు తీసుకుంటున్న వర్యలను హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మంటలను అరికట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఏజెన్సీల సాయాన్ని తీసుకోవాలని సూచించారు. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా పూర్తి సహకారం అందించాలని చెప్పారు.
Read also: Minister Kollu Ravindra: గోదావరి జిల్లాల్లో కొత్తగా 43 ఇసుక రీచ్లు

We will support the victims of the blowout incident
మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి పరిహారం అందించాలని
భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ఓఎన్ జిసి సహా ఇతర భాగస్వామ్య సంస్థలతో త్వరలో సమావేశం నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఆయా గ్రామాల ప్రజలకు అందుతున్న సహాయ చర్యలపైనా అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారని, వారికి ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితి వివరించి అండగా నిలవాలని సిఎం చంద్రబాబు సూచించారు. సమస్య పూర్తిగా తీరే వరకు ఇళ్లు, ఊళ్లు వదిలినవారు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. మంటల కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయిన వారికి పరిహారం అందించాలని ఆదేశించారు. పచ్చని కోనసీమలో బ్లోఆవుట్ ప్రజలను మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది.
ఉదయం 11.30 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ఆరంభమైంది
భీకర ధ్వనితో పేలుళ్లు, ఎగసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో స్థానికులు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి5 డ్రిల్లింగ్ సైటులో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ ఆరంభమైంది. 12.35 గంటలకల్లా నిప్పు తోడవడంతో 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ హరాత్పరిణామంతో సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇరుసుమండ సమీపంలోని మోరి 5 సైటులో 1993లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత ప్రారంభమైంది.
తర్వాత కాలంలో ఈ బావిలో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా వచ్చింది. ఇందులో నిక్షేపాల వెలికితీతకు 2024లో డీప్ ఇండస్ట్రీ లిమిటెడ్ కంపెనీకి లీజుకు అప్పగించారు. తాజాగా 2,700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం అనూహ్యంగా 2,500 పీడన స్థాయి (పీఎస్ఐ)లో గ్యాస్ బయటకు రాగా నియంత్రించేందుకు కెమికల్ మడ్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు. పీడన స్థాయి విపరీతంగా ఉండటం, మడ్ పంపింగ్ అదుపు చేయకపోవడంతో గ్యాస్ భారీగా ఎగజిమ్మింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: