విజయవాడ : ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతి పెద్దదని సుప్రీమ్ కోర్టు (supreme court) న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ లక్షణాలను కలిగి ఉందన్నారు. న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ మూల స్థంభం అని అన్నారు. జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన రాజ్యాంగ దృక్కోణం జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర (ఆప్ హోల్డింగ్ ద కానిస్టిట్యూషనల్ విజన్ ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జూడీషియరీ) అనే సెమినార్ లో సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. న్యాయ వ్యవస్థలో ప్రతి అంశంలో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా, స్థైర్యంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమ స్థానం కల్పించడం జరిగిందన్నారు. ఉత్తమ న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు.
Read also: AP Government: మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో స్మార్ట్ కిచెన్ పథకం

రోజు రోజుకు పరిజ్ఞానం పెంపొందిం చుకోవాలన్నారు
సామాన్యునికి న్యాయం చేరువ కావడానికి న్యాయ వ్యవస్థ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయ స్థానంలో జరిగే విచారణ సామాన్యునికి సైతం అర్ధం కావాలని, అప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని చెప్పారు. న్యాయ వ్యవస్థ చట్టానికి, గౌరవానికి వారధిగా పనిచేయాలని అందుకు న్యాయ మూర్తులుగా విలువలు, బాధ్యతలు పాటించాలని, మంచి క్రమ శిక్షణ, న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఉద్బోధించారు. పోటీ తత్వంలో విజయం సాధించే దిశగా ప్రతి న్యాయ మూర్తి తయారు కావాలని, రోజు రోజుకు పరిజ్ఞానం పెంపొందిం చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ పాట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జిల్లా న్యాయవ్యవస్థ న్యాయవ్యవస్థలోకే ముఖ్యమైనదని అన్నారు. జీవించే హక్కు కలిగి ఉండడం అంటే వ్యక్తి జీవించడం ఒకటే కాదని, మంచి జీవనాన్ని గడిపే హక్కు కలిగి ఉండటం అని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ పనితీరులో ఏమాత్రం అశ్రద్ధ ఉన్న అధికరణ 14,15 ప్రకారం న్యాయాన్ని సక్రమంగా వెలువరించడం సాధ్యం కాదని అన్నారు.
రాజ్యాంగం ప్రతి వ్యక్తికి పౌర హక్కులు
రాజీలేని న్యాయ వ్యవస్థను నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. రాజ్యాంగాన్ని సక్రమంగా పరిరక్షిoచుకోవడమే రాజ్యాంగానికి ఇచ్చిన విలువ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి జ్యుడిషియల్ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఇచ్చిందన్నారు. వీటిని జిల్లా న్యాయ వ్యవస్థ పటిష్టంగా రక్షణ కల్పించాలన్నారు. మహిళలు, చిన్నారులు పై వచ్చే వివాదాలు చాలా మేరకు సున్నితమైనవని సరైన ప్రక్రియ ద్వారా పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలోనే స్పష్టమైన విధానాన్ని అవలంబించడం ద్వారా కేసుల పరిష్కారంలో రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు చేయవచ్చని చెప్పారు. రాజ్యాంగ పీఠికలో ప్రతి పౌరునికి ఆర్ధిక, సామాజిక, సౌబ్రాతృత్వం వంటి అంశాలను కల్పించిందని చెప్పారు. కార్యక్రమంలో జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్, హై కోర్టు న్యాయమూర్తులు, జిల్లా ప్రధాన న్యాయ మూర్తులు, రాష్ట్రంలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న న్యాయ అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: