ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, 2047 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో “స్వర్ణాంధ్ర-2047” అనే దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రణాళికను గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అత్యంత కీలకంగా మారిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు (For employees of village and ward secretariats) తాజాగా ప్రభుత్వం బదిలీల నుంచి మినహాయింపు ప్రకటించింది.స్వర్ణాంధ్ర-2047 విజన్ కోసం పనిచేస్తోన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు
ఈ ఉద్యోగులను బదిలీ చేయకుండా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణాంధ్ర-2047 (Swarnandhra-2047) లో భాగంగా జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ పనుల్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు పాల్గొంటున్నారు. వీరిని బదిలీ చేస్తే పనులకు ఆటంకం కలుగుతుందని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో ప్రభుత్వం బదిలీలను రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.
బదిలీలు పారదర్శకంగా జరగడం లేదని
కొందరు ఉద్యోగులు ఆన్ డ్యూటీలో ఉండి ప్రణాళికలు తయారు చేస్తున్నారని, వారిని బదిలీ చేస్తే పనులు నిలిచిపోతాయని అధికారులు చెప్పారు. అందుకే ప్రభుత్వం వారి బదిలీలను రద్దు చేసింది. మరోవైపు, అన్నమయ్య, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఉద్యోగులు కౌన్సెలింగ్‌ను వ్యతిరేకించారు. బదిలీలు పారదర్శకంగా జరగడం లేదని వారు ఆరోపించారు. ‘ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’ అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే (MLA) ల సిఫార్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అర్హులైన ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

నేరుగా కౌన్సెలింగ్
సర్కారు జీవో 5 ప్రకారం సీనియారిటీ జాబితా, ఖాళీలను వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే, ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య, ప్రాధాన్య కేటగిరీలు, విజ్ఞప్తుల జాబితా, వంటి వివరాలను ప్రకటించాలి. కానీ, ఇవి ఏవీ లేకుండా నేరుగా కౌన్సెలింగ్ పిలవడం తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే మున్సిపల్, సాంఘిక, పశుసంవర్ధక,వంటి శాఖల్లో ఉద్యోగులు మూకుమ్మడి నిరసనకు దిగారు.కాగా, మున్సిపాల్టీ, కార్పొరేషన్ (Corporation) పరిధిలోని ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా వేరే వార్డులకు బదిలీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
సందేహాలకు ప్రభుత్వం
ఈ మేరకు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామ సచివాలయాల ఉద్యోగుల్లాగే, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా సొంత మండలాలకు బదిలీ చేయకూడదని గతంలో ప్రభుత్వం చెప్పింది. దీనిపై వచ్చిన సందేహాలకు ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. వార్డు సచివాలయాలకు మండలం వర్తించదని ప్రభుత్వం (Government) తెలిపింది. కాబట్టి మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులను వేరే వార్డులకు బదిలీ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, జిల్లాలోని ఇతర నగరాలు, పట్టణాల్లోని వార్డులకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.
Read Also: Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో హై టెన్షన్.. కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు