(AP) విజయవాడ వాసులకు నిజంగా తీపి వార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ (Vijayawada West Bypass) ఆఖరికి అందుబాటులోకి వచ్చింది. ఈ సంక్రాంతి కానుకగా కీలక రహదారిని పాక్షికంగా ప్రారంభించడంతో నగరంలోని ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది. ఇప్పుడు ఈ కొత్త రూట్ ఎన్ని ప్రాంతాలను కవర్ చేస్తుందో, దానివల్ల ఏ రూట్లలో ప్రయాణించే ప్రజలకు లాభం కలుగుతుందో వివరంగా చూద్దాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించి, వాహనాల రాకపోకలను అనుమతించారు. ఈ కొత్త రహదారి గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ నుండి కృష్ణా జిల్లాలోని పెద అవుటపల్లి వరకు ఉంది.
Read Also: AP: దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం
వెస్ట్ బైపాస్ రాకతో తగ్గనున్న వాహనాల రద్దీ
ఈ మార్గం అందుబాటులోకి రావడం వల్ల చెన్నై, గుంటూరు వైపు నుండి వచ్చే వాహనాలు, (AP) విజయవాడ నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఏలూరు, విశాఖపట్నం వైపు వెళ్ళిపోవచ్చు. కాజ టోల్ ప్లాజా దాటిన తర్వాత వెస్ట్ బైపాస్ ఎక్కి గొల్లపూడి, చిన అవుటపల్లి మీదుగా జాతీయ రహదారిని చేరుకోవచ్చు. అయితే ప్రస్తుతం గొల్లపూడి వైపు నుండి వచ్చే వాహనాలను కాజ వైపు వెళ్లడానికి అధికారులు ఇంకా అనుమతించలేదు.

అక్కడ కొన్ని నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం వెంకటపాలెం వద్ద టోల్ వసూలు ప్రారంభం కాలేదు. బైపాస్ పనులన్నీ పూర్తిగా పూర్తయ్యాకే టోల్ వసూలు చేస్తారు. ఈ వెస్ట్ బైపాస్ రాకతో నగరం లోపల భారీ వాహనాల రద్దీ తగ్గుతుంది. మిగిలిన పనులు మార్చి నెలలో నాటికి పూర్తవుతాయని, అప్పుడు పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: