हिन्दी | Epaper

Telugu News: AP: స్వామిత్వ గ్రామసభలు షురూ!

Sushmitha
Telugu News: AP: స్వామిత్వ గ్రామసభలు షురూ!

విజయవాడ: గ్రామాలు, గ్రామ కంఠంలో ఇళ్లు, స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. స్వామిత్వ పథకం రెండో విడతగా 45 లక్షల ఆస్తులకు సంబంధించి కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డులను ప్రజలకు అందించడానికి ముందు, వాటిపై అభ్యంతరాలను స్వీకరించడానికి సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆదేశాల మేరకు ఈ నెల 22 వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా గ్రామసభలను నిర్వహించనున్నాయి.

Read Also: TTD: కల్తీనెయ్యిలో కీలకం గత టిటిడి బోర్డు పెద్దలే! అధికారుల నుండి సమాచారం

AP
AP

డ్రోన్ సర్వే, లక్ష్యాలు

గ్రామ కంఠాలలో ఇళ్లు, దుకాణాలు, ఇతర స్థిరాస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే “స్వామిత్వ” కార్యక్రమం ఇప్పుడు గాడిన పడుతోంది. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 1,300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేయడంతో, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్(AP) చివరి స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితిని మార్చడానికి, కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 6 వేల గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల సమగ్ర వివరాలు డ్రోన్ల ద్వారా సేకరించింది. డ్రోన్ సర్వే తర్వాత ఆస్తులకు సంబంధించిన కొలతలు నిర్ధారించుకునేందుకు 2,300 గ్రామాల్లో సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదికలు సిద్ధం చేశారు.

పారదర్శకత, ప్రయోజనాలు

మూడో దశను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి కార్డులు పంపిణీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు. ప్రాపర్టీ కార్డులు(Property cards) లభిస్తే గ్రామీణ ప్రజలు తమ ఆస్తులను విక్రయించుకోవచ్చు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం, వారసులకు ఆస్తులు బదిలీ చేయడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకోసం రెవెన్యూ చట్ట సవరణ కూడా చేశారు. ప్రస్తుతం 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈతకు వెళ్లి నీటి కుంటలో పడి ఆర్మీ జవాన్ మృతి

ఈతకు వెళ్లి నీటి కుంటలో పడి ఆర్మీ జవాన్ మృతి

మూలపేట పోర్ట్ కు లైన్ క్లియర్.. 385 ఎకరాల భూమి బదలాయింపు

మూలపేట పోర్ట్ కు లైన్ క్లియర్.. 385 ఎకరాల భూమి బదలాయింపు

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. నిందుతునికి 20 యేళ్లు జైలు

మైనర్ బాలిక అత్యాచారం కేసు.. నిందుతునికి 20 యేళ్లు జైలు

లారీ, ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

లారీ, ద్విచక్ర వాహనం ఢీ, ఇద్దరు యువకులు మృతి

ఎసిబి వలలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్

ఎసిబి వలలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్

మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

మొయినాబాద్ కేసుపై చంద్రబాబు సీరియస్; ఎంపీ పుట్టా మహేష్‌కు షాక్!

బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల

ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

ఏపీలో 150 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

తిరుమలకు యుద్ధ సెగ: గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు బంద్

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే

📢 For Advertisement Booking: 98481 12870