శ్రీకాకుళం : ఎసిబి (AP) వలలో శ్రీకాకుళం సబ్ ట్రెజరీ అధికారి ఎన్.రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ ఎ. శ్రీనివాసులు చిక్కారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం (Tahsildar’s office) ఆవరణలో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఒక విశ్రాంత ఉద్యోగి నుంచి శాలరీ ఎరియర్స్ కోసం రూ.15వేలు నగదు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడు శాలరీ ఏరియర్ బిల్లు రూ.4,34,697 కోసం రూ. 20వేలు డిమాండ్ చేశారని, చివరికి రూ.15వేలు ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిపారు.
Read Also: Group 2 : ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

ఇద్దరు అధికారులపై కేసు నమోదు
17 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా డిమాండ్ చేసిన మొత్తవం ఇవ్వకుండా బిల్లు పెట్టడానికి నిరాకరించడంతో ఎసిబిని ఆశ్రయించాడు. (AP) సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు ద్వారా రూ.15వేలు నగదును సబ్ ట్రెజరీ అధికారి ఎన్.రవిప్రసాద్ తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం కార్యాలయంలో రికార్డులను పరిశీలించి ఇద్దరినీ విచారించి విశాఖకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో ఎసిబి డిఎస్పీ రమణ, సిఐ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: