ఆంధ్రప్రదేశ్ (AP) రాజధాని అమరావతిలో తొలిసారి గా నిర్వహించిన, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
Read Also: RepublicDay: టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం
హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా, పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుండి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని, ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు.వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన, తన స్పందనను తెలియజేశారు. నేలపాడులోని పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పవన్ పేర్కొన్నారు.ప్రదర్శనలో పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని చక్కగా ప్రతిబింబించాయని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అమరావతి సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల వేదికపై నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసిందని కొనియాడారు.భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకువెళతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: