ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను అందించేందుకు వీలుగా రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గతంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేది. అయితే, ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మార్చడంతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సులభంగా సేవలు పొందేందుకు వీలు కల్పించింది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, మార్పుల కోసం ప్రత్యేకంగా సచివాలయాల్లో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటల్ సహాయకులు పర్యవేక్షిస్తారు.
Read Also: CM Chandrababu: 2026–27కు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు

కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డు దరఖాస్తు
కొత్తగా పెళ్లైన జంటలు రేషన్ కార్డు కాగా పెళ్లైన జంటలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు సులభంగా చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు: భార్యా భర్తల ఆధార్ కార్డు వివరాలు, భర్త పాత రేషన్ కార్డు, మరియు వివాహ ధ్రువీకరణ పత్రం (Marriage Certificate). ఈ డాక్యుమెంట్స్ తీసుకుని సమీపంలోని సచివాలయానికి వెళ్లి డిజిటల్ సహాయకులను సంప్రదించాలి. వారు వెబ్‌సైట్‌లో ‘మ్యారేజీ స్ప్లిట్’ ఆప్షన్ కింద వివరాలు నమోదు చేసి, ఈకేవైసీ (eKYC) పూర్తి చేస్తారు. నమోదు పూర్తయిన తర్వాత, స్థానిక వీఆర్వో (VRO) మరియు తహసీల్దారు పరిశీలన అనంతరం కొత్త కార్డు మంజూరు చేస్తారు.
రేషన్ కార్డులో పిల్లల పేర్ల నమోదు, చిరునామా మార్పు
రేషన్ కార్డులో పిల్లల పేర్లను నమోదు చేయడం కూడా చాలా సులభమైంది. పిల్లల ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, మరియు తల్లిదండ్రుల రేషన్ కార్డు (Ration card) వివరాలతో సచివాలయంలోని డిజిటల్ సహాయకులను సంప్రదించాలి. వీఆర్వో, తహసీల్దారు అనుమతి రాగానే రేషన్ కార్డులో కొత్త పేర్లు చేరుస్తారు. కొత్త కార్డులు, పేర్ల నమోదుతో పాటు, రేషన్ కార్డులలో చిరునామా మార్పునకు కూడా ప్రభుత్వం సచివాలయాల ద్వారా అవకాశం కల్పించింది.
కార్డుల జారీకి సమయపాలన
ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను నిరంతరం కొనసాగిస్తున్నప్పటికీ, కార్డులు జారీ చేయడానికి సమయపాలన నిర్ణయించింది:
- జనవరి – జూన్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జులై నెలలో కొత్త బియ్యం కార్డులు అందిస్తారు.
- జులై – డిసెంబర్ మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: