విజయవాడ దుర్గ గుడికి కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదంటూ విద్యుత్(Electricity) సరఫరా నిలిపివేశారు. (AP) కరెంట్ బిల్లు బకాయిలు ఉన్నాయంటూ ఏపీసీపీడీసీఎల్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం రూ.3.08 కోట్లు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉందంటూ ఏపీసీపీడీసీఎల్ ఈ చర్యలు తీసుకుంది. అయితే విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.
Read Also: Cyber Crime: సీఐడీ అధికారుల అదుపులో సైబర్ నేరగాళ్లు

మూడు గంటల తర్వాత కరెంట్ సరఫరా పునరుద్ధరణ
జనరేటర్ సాయంతో ఆలయంలో విద్యుత్ సేవలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో దేవస్థానం సంప్రదింపులు జరిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. దీంతో మూడు గంటల అనంతరం విజయవాడ దుర్గ గుడికి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ బిల్లు చెల్లించలేదంటూ ఏపీసీపీడీసీఎల్.. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి శుక్రవారం నోటీసులు ఇచ్చింది. శనివారం కరెంట్ సరఫరాను నిలిపివేసింది. 2023 ఫిబ్రవరి నుంచి దుర్గ గుడి దేవస్థానం కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ బకాయిలు సుమారుగా రూ.3.08 కోట్లు ఉన్నట్లు సమాచారం. దేవస్థానం నుంచి స్పందన లేదని ఏపీసీపీడీసీఎల్ అధికారులు చెప్తున్నారు. దీంతో శనివారం దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చెప్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: