AP Police Jobs 2025 : ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పోలీస్ శాఖలో అడుగుపెడుతున్న యువతకు స్వయంగా అభినందనలు తెలియజేసేందుకు సీఎం చంద్రబాబు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఎంపికైన కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.
Andhra Pradesh weather : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…
గత ప్రభుత్వ హయాంలో పోలీస్ నియామకాలు (AP Police Jobs 2025) ఆలస్యం కావడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుందని అధికారులు పేర్కొన్నారు. నియామకాలపై దాఖలైన 31 రిట్ పిటిషన్లను న్యాయస్థానాల్లో పరిష్కరించి, కేవలం 60 రోజుల్లోనే పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 6,014 మందిలో 5,757 మంది శిక్షణకు హాజరుకానున్నారు. వీరిలో 3,343 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 2,414 మంది ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు కాగా, మొత్తం 993 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీస్ శాఖలోనూ నియామకాలను పూర్తి చేయడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :