हिन्दी | Epaper

AP: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి

Saritha
AP: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

Read Also: AP Budget 2026: ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు ఉచితవిద్యుత్

AP: బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి
NEET UG is now mandatory for B.Sc Nursing admissions

(AP) వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్యా సంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా నీట్ యూజీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, నర్సింగ్ ప్రవేశాల కోసం ఉత్తమ విధానాన్ని రూపొందించే దిశగా సమీక్ష చేపట్టారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని నర్సింగ్ అడ్మిషన్లు కేంద్ర ప్రమాణాలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870