ఆంధ్రప్రదేశ్‌లో(AP) మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఇందుకు ప్రధాన కారణమని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నకిలీ మద్యానికి అడ్డుకట్ట వేసే చర్యలతో పాటు ప్రజలకు ప్రాధాన్యమైన బ్రాండ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: AP: పునర్విభజనపై తుది నిర్ణయం.. జిల్లాల సంఖ్య 28కి పరిమితం

కొత్త మద్యం పాలసీ ప్రకారం గతంలో నిలిపివేసిన 87 ప్రముఖ బ్రాండ్లను మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ కాలంలో పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు కేవలం 20.7 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అవి 74 శాతానికి పెరిగాయి. అలాగే సుమారు 50 బ్రాండ్ల ధరలను తగ్గించడంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. రూ.99 క్వార్టర్ మద్యం ప్రవేశపెట్టడం కూడా అమ్మకాల పెరుగుదలకు తోడైంది.
సరిహద్దు జిల్లాల్లో భారీగా పెరిగిన విక్రయాలు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు 40 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం గణనీయంగా పెరిగిందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
నకిలీ మద్యం నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి మద్యం సీసాపై QR కోడ్ అమలు చేస్తూ, వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా మద్యం నాణ్యతను తెలుసుకునే అవకాశం కల్పించింది. తాజాగా దేశంలోనే తొలిసారిగా ప్రతి మద్యం సీసాకు ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ముద్రించాలని నిర్ణయించింది. ఈ నెంబర్‌లో బ్రాండ్, తయారీ తేదీ వంటి వివరాలు ఉంటాయి.
మద్యం పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(AP) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం విధానాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి దిశగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. మద్యం సరఫరాలో పారదర్శకత కోసం జియో ట్యాగింగ్, షాపుల రేషనలైజేషన్‌పై దృష్టి పెట్టాలని తెలిపారు. అలాగే బాటిళ్లు తిరిగి ఇచ్చిన వారికి డీఆర్‌ఎస్ (డిపాజిట్ రిటర్న్ స్కీమ్) కింద నగదు ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: