రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) కొత్త సిలబస్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఇంటర్ పరీక్షల విధానంలోనూ గణనీయమైన మార్పులు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
Read Also: UPSC Jobs 2025 Alert: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో ప్రవేశం

ఫస్ట్ ఇయర్‌లో సీబీఎస్‌ఈ తరహా విధానం
జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో సీబీఎస్‌ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు(AP) చేశారు. ఈ సబ్జెక్టులన్నింటికీ 100 మార్కులకు పరీక్షలు ఉంటాయి. అలాగే ఒక్క మార్కు ప్రశ్నల విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు.
జవాబు పుస్తకాలు, టైంటేబుల్‌లో మార్పులు
మార్పులు చేసిన సబ్జెక్టులకు జవాబు పుస్తకాలను 32 పేజీలకు పెంచారు. సిలబస్ మార్పులేని సబ్జెక్టులకు మాత్రం మునుపటిలాగే 24 పేజీల బుక్‌లెట్ కొనసాగుతుంది. ఒక్కో పరీక్షకు కనీసం రెండు రోజుల విరామం ఉండేలా పరీక్షా (AP)షెడ్యూల్ రూపొందించారు. ఈ కొత్త విధానం 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. సెకండ్ ఇయర్ పరీక్షలు ఈ ఏడాది పాత విధానంలోనే జరుగుతాయి.
అన్ని గ్రూపులకు 5 సబ్జెక్టుల విధానం
ఇప్పటి వరకు సైన్స్ గ్రూపుల్లో 6 సబ్జెక్టులు (2 లాంగ్వేజెస్ + 4 మెయిన్ సబ్జెక్టులు), ఆర్ట్స్ గ్రూపుల్లో 5 సబ్జెక్టులు ఉండేవి. అయితే కొత్త విద్యా సంవత్సరం నుంచి అన్ని గ్రూపులకు 5 సబ్జెక్టుల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ఒక భాష (ఇంగ్లిష్ తప్పనిసరి)తో పాటు నాలుగు ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి.
ఆరో సబ్జెక్టుగా రెండో లాంగ్వేజ్ ఎలక్టివ్
రెండో లాంగ్వేజ్‌ను ఇకపై ఆరో సబ్జెక్టుగా ఎలక్టివ్‌గా మార్చారు. విద్యార్థులు భాష లేదా 23 ప్రధాన సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఒకటి ఫెయిల్ అయినా, ఆరో సబ్జెక్టు పాస్ అయితే దానిని ప్రధాన సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే ఆరో సబ్జెక్టును లెక్కలోకి తీసుకోవాలంటే ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా పాస్ కావాలి. సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో 3, 4 లేదా 5 సబ్జెక్టులు ప్రధాన సబ్జెక్టులుగా ఉంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :