हिन्दी | Epaper

AP: అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!

Saritha
AP: అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!

AP: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ (SIT) విచారణ, తదుపరి పరిణామాలు చోటుచేసుకోగా, ప్రభుత్వం తాజాగా ఏకసభ్య కమిటీని కూడా నియమించింది. ఈ క్రమంలో, తమ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రేపు అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చ చేపట్టాలని నిర్ణయించింది. రేపు శాసనసభలో లడ్డూ వివాదంపై సమగ్ర చర్చ జరగనుంది.

అసెంబ్లీలో లడ్డూ వివాదంపై చర్చ జరగనున్న సమయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా, రేపటి నుంచి రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read Also: TTD Laddu Case: లడ్డూ కేసు: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

AP: అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!
AP: Jagan’s key decision on laddu debate in the assembly..!

పులివెందుల పర్యటన

రేపు సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారని, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారని తెలిపింది. అలాగే ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారని, అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్భార్‌ నిర్వహిస్తారని, రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారని వెల్లడించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!

అసెంబ్లీలో లడ్డూ పై చర్చ జగన్ కీలక నిర్ణయం..!

చలో సెక్రటేరియట్‌కు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు

చలో సెక్రటేరియట్‌కు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపు

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ ముప్పు

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ ముప్పు

భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ టాప్.. స్మార్ట్‌ఫోన్లు చరిత్ర సృష్టించాయి

భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ టాప్.. స్మార్ట్‌ఫోన్లు చరిత్ర సృష్టించాయి

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట!

చిన్నారి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ముందుకొచ్చిన దాతలు

చిన్నారి రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం ముందుకొచ్చిన దాతలు

భారత్ బ్యాడ్ రికార్డ్

భారత్ బ్యాడ్ రికార్డ్

భారీగా పతనమైన IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు

భారీగా పతనమైన IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు

బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు

బెంగళూరుకు బిగ్ షాక్.. మంగళూరుకు వెళ్లిపోతున్న ఐటీ కంపెనీలు

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

📢 For Advertisement Booking: 98481 12870