పండుగ వాతావరణంలో మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. సంక్రాంతి వేళ మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99 ఎంఆర్‌పీ ఉన్న బాటిళ్లను మినహాయించి, మిగిలిన అన్ని రకాల మద్యంపై (Alcohol) ఒక్కో బాటిల్‌కు రూ.10 పెంపు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పెంపు బీర్, వైన్, ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వంటి అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సమయంలో స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడపాలని భావించిన మందుబాబులకు ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తోంది.
Read also: Bhogi Festival: పండుగ ఆచారాలు.. పిల్లలకు భోగి పళ్లు, దానానికి ప్రత్యేక ప్రాధాన్యం

AP Government
అదే సమయంలో బార్లపై అమలులో ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పన్ను కారణంగా బార్లలో మద్యం ధరలు వైన్ షాపులతో పోలిస్తే ఎక్కువగా ఉండేవి. ఈ అంశంపై బార్ యజమానులు చాలాకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజా నిర్ణయంతో బార్లు, వైన్ షాపుల్లో మద్యం ధరలు సమానంగా మారనున్నాయి. అయితే ఈ ట్యాక్స్ రద్దుతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.340 కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మద్యం ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే, రూ.99 లోపు ధర ఉన్న మద్యం బాటిళ్లపై రిటైల్ షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్‌ను 1 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల తక్కువ ధరలో విక్రయించే మద్యం, బీర్, వైన్‌పై రిటైలర్లకు కొంతమేర లాభం కలగనుంది. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయం ప్రభుత్వ ఆదాయానికి అనుకూలంగా ఉండగా, పండుగ పూట ఖర్చు పెరగడం వల్ల వినియోగదారులకు మాత్రం భారంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: