నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పథకం(NTR Bharosa Scheme) కింద జనవరి నెలకు చెల్లించాల్సిన సామాజిక భద్రత పింఛన్‌ను సాధారణ తేదీకి ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా డిసెంబర్ 31న పింఛన్ మొత్తం నేరుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
Read also: AP: ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు

నూతన సంవత్సర కానుక.. ఏపీలో ముందస్తు పింఛన్ల పంపిణీ
నూతన సంవత్సరం వేడుకలకు ప్రజలు ఆటంకం లేకుండా పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును డిసెంబర్ 30న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జిల్లాల స్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తిచేయాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీలను ప్రభుత్వం ఆదేశించింది.
లబ్ధిదారులకు నూతన సంవత్సర గిఫ్ట్
ఇక ఈ ఏర్పాట్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అన్ని వర్గాల లబ్ధిదారులు నూతన సంవత్సరాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరుపుకోగలుగుతారని అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల వేలిముద్ర ధృవీకరణతో పాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు. ఎక్కడా ఆలస్యం లేదా అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ పెంచాలని జిల్లా స్థాయి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: