కాలుష్య పరిశ్రమలు తక్షణం మూసివేయాలి కాకినాడ Kakinada : కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ Uppada సెంటర్లో మత్స్యకారులు మంగళవారం తీవ్ర ఆందోళన చేపట్టారు. AP సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమల నుండి నుండి వ్యర్థ పదార్థాలను సముద్రంలోకి తరలించడం వలన మత్స్య సంపద నాశనం అవుతున్నదని, తీరప్రాంతంలోని నిర్మించిన పరిశ్రమలను తక్షణం మూసివేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై మహిళలు, మత్స్యకార కుటుంబ సభ్యులు బైకా యించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ Chief Minister Pawan Kalyan హామీ ఇచ్చేవరకు రాస్తారోకో కొనసాగిస్తామన్న ఆరు. ఫార్మా కంపెనీలు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం కారణంగా సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించక జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నామని మా ఆకలి కేకలు వినండని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉప్పాడ, అమీనాబాదు గ్రామాల మత్స్యకారులు కుటుంబాలతో సహా ఉప్పాడ బీచ్ రోడ్డు సెంటర్లో ఫ్లకార్డులతో బైఠాయించి మంగళవారం ఆందోళన నిర్వహించారు. గత 6 నెలలుగా మత్స్య సంపద లభించక కుటుంబాలు వస్తులుండే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్క రించడానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

AP
అధికారులు చర్చలు విఫలం ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులతో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీవో మల్లిబాబు, పాడా పీడీ వేణుగోపాలరావు Venugopal Rao జరిపిన చర్చలు సఫలం కాలేదు. మత్స్యకారులతో అధికారులు చర్చలు కొలిక్కి రాకపోవడంతో జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి విచ్చేసి స్థానిక తహసీల్దారు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. మత్స్యకారులతో చర్చించడానికి సంప్రదింపులు జరపగా విముఖత వ్యక్తం చేయడంతో కార్యాలయం నుండే కలెక్టర్ వెనుదిరిగి వెళ్ళిపోయారు. డిప్యూటీ సీఎం హామీ ఇచ్చే వరకు ఆందోళన,స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేదిలేదని మత్స్యకారులు చెప్పారు. ఆయన మత్స్యకారులు అభివృద్ధికి కృషి చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. AP దీంతో నేడు కూడా ఆందోళన కొనసాగుతుందని మత్స్యకారులు తెలిపారు.
ఉప్పాడలో మత్స్యకారులు ఎందుకు ఆందోళన చేసారు?
సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమల నుండి వ్యర్థ పదార్థాలు సముద్రంలోకి విసిరివేయడం వల్ల మత్స్య సంపద నాశనం అవుతోందని, పరిశ్రమలను తక్షణం మూసివేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన ఎక్కడ నిర్వహించబడింది?
A2: ఉప్పాడ బీచ్ రోడ్ సెంటర్, కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: