ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం గిరిజన రైతులకు అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్)ను తిరిగి గాడిన పెట్టింది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించింది. గిరిజన రైతులకు అండగా నిలిచేందుకు ఈ సంస్థ ద్వారా వ్యవసాయ, మత్స్య, ఉద్యాన పరికరాలు అందిస్తారు. ఐటీడీఏల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.
Read Also: AP: మార్చిలోగా కోటి మందికి స్వమిత్వ యాజమాన్య హక్కు పత్రాలు

నిధుల దుర్వినియోగం
వ్యవసాయ, మత్స్య, ఉద్యాన పరికరాలను 90% రాయితీతో అందిస్తోంది. ఈ పథకం ద్వారా రూ.13.70 కోట్లతో 12వేల మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుంది. ట్రాక్టర్లు వంటి ఖరీదైన పరికరాలను సంఘాల ద్వారా మంజూరు చేయనున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొన్న ఈ పథకాన్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించడం గిరిజన రైతులకు ఒక మంచి అవకాశంగా పరిగణించబడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: