ఆంధ్రప్రదేశ్ (AP) లో, త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందని మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తామని, జిల్లాల వారీగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. విజయవాడ గొల్లపూడిలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను ఆమె సందర్శించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత సివిల్స్ కోచింగ్ అందజేస్తున్నట్లు తెలిపారు.
Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: