AP current bills reduction:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఒక చక్కటి తీపి కబురు అందించింది. రాష్ట్రంలో గృహ, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగానికి చెందిన కరెంట్ బిల్లుల భారం తగ్గనుంది. ఏపీఈఆర్సీ ఆమోదించిన ట్రూడౌన్ ప్రక్రియ ద్వారా వినియోగదారులకు భారీ ఆర్థిక ఉపశమనం లభించనుంది. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం మరియు సమర్థవంతమైన ఆర్థిక విధానాలను పాటించడం వల్ల ఈ ధరల తగ్గింపు సాధ్యపడింది.
Read also: Corona Cases : ఏపీలో కరోనా కేసులపై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్యశాఖ

ట్రూడౌన్ ద్వారా రూ. 1,553 కోట్ల భారీ లబ్ధి
గత రెండేళ్ల కాలంలో మొత్తం రూ. 1,553 కోట్ల మేర వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాన్ని కరెంట్ బిల్లులలో సర్దుబాటు చేయనున్నారు. విద్యుత్ సంస్థల ఖర్చులు తగ్గినప్పుడు ట్రూడౌన్ ద్వారా నేరుగా వినియోగదారుల బిల్లులలో రాయితీ వర్తింపజేస్తారు. దీనివల్ల ప్రజలందరి జేబులపై పడే నెలవారీ విద్యుత్ ఛార్జీల భారం గణనీయంగా తగ్గిపోతుంది.
AP current bills reduction:ట్రూఅప్ గోస తప్పింది.. జేబుల పైసలు మిగులుతయ్
రాష్ట్రంలో అమలు చేస్తున్న పారదర్శక పాలన మరియు విద్యుత్ రంగ సంస్కరణల వల్ల ఈ సానుకూల మార్పు వచ్చింది. గతంలో ఖర్చులు పెరిగినప్పుడు ట్రూఅప్ పేరుతో అదనపు వసూళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు వ్యయం తగ్గడం వల్ల వినియోగదారులకు డైరెక్ట్ డిస్కౌంట్ అందుతోంది. ఈ నిర్ణయం ద్వారా సామాన్య ప్రజలతో పాటు అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: