Srisailam Devasthanam:శ్రీశైల క్షేత్రం నూతన ఏఈఓగా హర్యానాయక్ ఎంపిక

Follow Us: Google News Daily Hunt
Haryanayak appointed as new AEO of Srisailam Temple
Haryanayak appointed as new AEO of Srisailam Temple
FONT SIZE
GET APP

Srisailam Devasthanam:శ్రీశైల దేవస్థానం నూతన ఏ.ఈ.ఓ గా పదోన్నతి. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పర్యవేక్షకులుగా విధులను నిర్వహిస్తున్న హర్యానాయక్ కు ఏ.ఈ.ఓ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను దేవస్థానం జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అధికారికంగా శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతు గుంట రమేష్ నాయుడు, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎం, శ్రీనివాసరావుల చేతుల మీదుగా సంయుక్తంగా పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు.

Read also: APSRTC Electric Buses: ఏపీలో ఈవీ బస్సులు రోడ్డెక్కేది ఎప్పుడో?

Srisailam Devasthanam:స్వామివారి సేవలో మరింత బాధ్యత పెరిగింది

ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారిని శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానంలో పదోన్నతి పొందిన ఏ.ఈ.ఓ హర్యానాయక్ విధుల పట్ల అంకితభావంతో పని చేయడంతో అంచలంచెలుగా ఎదుగుతూ ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ పదోన్నతిని మరింత బాధ్యతను పెంచిందని శ్రీ స్వామి అమ్మవార్ల సేవలో మరియు భక్తులకు మరింత సేవలు అందించే విధంగా తమ విధులను కొనసాగించాలని చెప్పారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు