ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్
వరదయ్యపాళెం : (AP) వరదయ్యపాలెం మండలం సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో సూళ్లూరుపేటలోని పూజిత అగ్రో సర్వీస్ సెంటర్లో సుమారు రూ.1500లకు కల్తీ విత్తనాలను కొని నారు పోసి నాటగా 15 రోజుల్లోనే ఎన్నులు తీయడం, ఫైకి ఎదగకపోవడం వల్ల కల్తీ విత్తనాలతో నష్టపోయిన సుమారు 250 మంది రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.62000 నష్టపరిహారం చెల్లించాలని. ఈ కల్తీ(adulteration) విత్తనాలు అమ్మిన సుళ్లూరుపేట పూజిత ఆగ్రో సర్వీస్ సెంటర్ యాజమాని శ్రీధర్ రెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కన్వీనర్ సుధాకర్ రెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సత్యవేడు నియోజకవర్గ కార్యదర్శి అంబాకం చిన్ని రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read also: AP: రైలు ప్రమాద ఘటన.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

రైతులు కల్తీ విత్తనాల కారణంగా ఆవేదన వ్యక్తం
వరదయ్యపాలెం మండలంలోని మావిళ్ళపాడు కలతూరు కొవ్వకొల్లి మరదవాడ అంగూరు సాతంబేడు తదితర గ్రామాల రైతులు సుమారు 250 మంది విత్తనాలు (AP)నారుపోసి నాటి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎక్కువ మంది రైతులు భూములను కౌలుకు తీసుకొని ఈ వ్యవసాయ సాగు చేస్తున్నారని, కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన భూమి గల యజమానులకు కవులు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రైతులు తీవ్ర ఆవేదనకు గురి ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సుధాకర్రెడ్డి చిన్నిరాజ్ నాయకత్వాన వరదయ్యపాలెం మండలంలోని గ్రామాల పొలాలలో క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఆ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుత్తకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న మాకు ఈ కల్తీ విత్తనాలు వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి భూములను సరియైన నిర్వహించి రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకోవడమే తప్ప వేరే గత్యంతరం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ధనుంజయులు శెట్టి చంద్ర, ధనంజయల్ నాయుడు, చలపతి నాయుడు, విజయ ఉప్పరపాటి, మునిరాజా, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: