ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు బుధవారం పోలవరం ప్రాజెక్ట్ లోని పలు విభాగాలలో పనుల ప్రగతిని పరిశీలించారు. బుధవారం ఉదయం పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుండి పనుల ప్రగతిని పరిశీలించారు. జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ప్రాజెక్ట్ సూపెరింటెండెండింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, తదితరులు ముఖ్యమంత్రికి ప్రాజెక్ట్ పనుల ప్రగతిని ముఖ్యమంత్రి కి వివరించారు.
Read Also: Chandrababu: నీటి అంశాల్లో పోటీగా మాట్లాడటం సరికాదు: సీఎం
ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి
అనంతరం అప్పర్ కాఫర్ డాం చేరుకొని, అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాప్ – 1, గ్యాప్ 2, ఈసిఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, కుడి ప్రధాన కాలువ కనెక్టువిటీస్ చేరుకొని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ లను పరిశీలించి, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైబ్రో కంప్యాక్షన్ చేరుకొని అక్కడ పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి, వివరాలను ఇంజనీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

సిఎం వెంట జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రులు డా. నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారధి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ,శాసనసభ్యులు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, డా. కామినేని శ్రీనివాస్, సొంగా రోషన్ కుమార్, పితాని సత్యనారాయణ, ఏలూరు రేంజి ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ., ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఏపీ ఏఎస్ సిపిసి చైర్మన్ పీతల సుజాత, ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రభృతులు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: