हिन्दी | Epaper
దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్త సమ్మెను కొత్త బడ్జెట్ పై 16 నుండి రెండో స్థానంలో క్రికెట్ రైతు భరోసా బంద్ అంబటి రాంబాబు 60/61 తప్పనిసరి బంగారం మీద పెట్టుబడి వేస్ట్ 88 వేల ఉద్యోగాలు మంత్రి లోకేశ్ సీరియస్ రాజకీయ దాడి ఆరోపణలు ఉద్యోగ అవకాశాలు

AP: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Saritha
AP: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యం పాలైతే సంబంధిత జిల్లా కలెక్టర్లు, మంత్రులనే బాధ్యుల్ని చేస్తామని (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(Chandrababu) నాయుడు గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వ పాలసీలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు మంత్రులు, కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పాలసీలు సమర్థవంతంగా అమలైతేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

AP: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Chandrababu makes crucial remarks on the health of hostel students.

ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి

(AP) సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రం 14 శాతం అధిక వడ్డీతో అప్పులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను గాడిలో పెట్టి, రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ పెంచడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నామని వివరించారు. ప్రతి ఐదేళ్లకు జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. జూలై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసులకు హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేయాలని, 5 లక్షల మంది హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. గర్భిణుల్లో సిజేరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. మాతాశిశు సంరక్షణ కోసం ‘కేర్ అండ్ గ్రో’ కార్యక్రమాన్ని, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని చెప్పారు. రాష్ట్ర జనాభా నిర్వహణ కోసం మార్చి నాటికి ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870