ఆంధ్రప్రదేశ్ (AP) సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ గర్వించదగ్గ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు విశాఖపట్నంలో 500 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్‌ను కేటాయిస్తూ మంత్రుల మండలి ఆమోదం తెలిపింది.
Read Also: Kakinada Crime: కల్తీ నెయ్యి.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

త్వరితగతిన ఇళ్ల పంపిణీ జరిగే అవకాశం
టిడ్కో (TIDCO) గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హడ్కో (HUDCO) నుంచి రూ.4,451 కోట్ల రుణ సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (AP) దీనివల్ల లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్ల పంపిణీ జరిగే అవకాశం ఉంది.పిడుగురాళ్లలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, టీటీడీ పోస్టుల అప్‌గ్రేడ్, జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూముల కేటాయింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ తీర్మానాలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: