हिन्दी | Epaper

AP Assembly: వారు 11 మంది, తేదీ 11.. సభలో ఉన్నది 11 నిముషాలే

Rajitha
AP Assembly: వారు 11 మంది, తేదీ 11.. సభలో ఉన్నది 11 నిముషాలే

వైకాపా సభ్యులపై చలోక్తిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు

విజయవాడ : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా వైసిపి సభ్యులు వాకౌట్ చేసారు. 11వ తేదీ, 11 మంది, 11 నిమిషాలు ఉండి వెళ్లి పోయారుగా అని వైఎస్సార్సీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు చలోక్తిగా అన్నారు. అసెంబ్లీలో ఇరుసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా. అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా? అని వ్యాఖ్యానించారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటిస్తే మంచిదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీకి సభ్యుల హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read also: Telugu States: అప్పుడే మండుతున్న ఎండలు

AP Assembly

They are 11 people, the date is 11.. There are only 11 minutes in the House.

ఫేషియల్ రికగ్నిషన్‌తో డిజిటల్ అటెండెన్స్

ఏపీ అసెంబ్లీ సభ్యులకు డిజిటల్ హాజరు తప్పనిసరి అని స్పీకర్ ఆదేశించారు. దాగుడు మూతలు ఇక కుదరవని, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఈ సందర్భంగా -ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ రికార్డు కానుందని స్పీకర్ వివరించారు. అంతేకాకుండా అసెంబ్లీ రిజిస్టర్లో ఎమ్మెల్యేలు చేసే సంతకాలు చెల్లవని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో తాజాగా బులెటిన్ జారీ అయింది. సభలోకి రాకుండానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంతకాలను పెట్టి వెళ్లిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలియజేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరును గుర్తించేలా డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ఈరోజు నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అమలు చేసేందుకు ఏపీ శాసనవ్యవస్థ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

పోలీసులపై కాల్పులకు దుండగుడి యత్నం

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ
0:19

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసులో ట్విస్ట్.. విచారణకు హాజరైన వీణ

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

యువ పార్లమెంట్ పోటీల్లో పద్మావతి వర్సిటీ విద్యార్థినుల విజయం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

శ్రీ కనక దుర్గమ్మ మహాకుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర కేబినెట్‌లోకి జనసేన? ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం!

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

ఏపీ లస్కర్ల వేతనాల్లో భారీ పెంపు

📢 For Advertisement Booking: 98481 12870