విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్ కు ప్రభుత్వం కొత్త సారథులను నియమించింది. ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరిలో వి.శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న (అనంతపురం), ఒంటేరు రవిబాబు (కడప), పరవాడ సింహాచలం నాయుడు (విశాఖపట్నం) ఉన్నా. నియమితులైన వారంతా న్యాయవాద వృత్తికి చెందినవారు కావడం గమనార్హం.
Read also: BookLaunch: ఒత్తిడి నిండిన జీవితానికి ‘హాస్యం’ దివ్యౌషధం

Lawyer Vajja Srinivasa Rao appointed as CIC
ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని
ఈ కొత్త కమిషనర్లు మూడేళ్ల పాటు లేదా వారికి 65 ఏళ్లు వచ్చే వరకు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన, మంత్రులతో కూడిన సెలెక్షన్ కమిటీ చేసిన సిఫార్సులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ నియామకాలను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉండగా, తాజా నియామకంతో కమిషన్ బలం గణనీయంగా పెరిగింది. ఈ నియామకాలతో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుందని, ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: