(AP) రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంతో పాటు, జిల్లాల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి (AP) ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది.
Read Also: Rammohan Naidu: రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ గ్రీటింగ్స్
అధికారిక ఉత్తర్వులు
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు జి. వీరపాండియన్, కాకినాడకు ప్రసన్న వెంకటేష్, బాపట్లకు మల్లికార్జున్, శ్రీ సత్యసాయి జిల్లాకు గంధం చంద్రుడు, నంద్యాల జిల్లాకు సి.హెచ్. శ్రీధర్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు.

అయితే, ఆ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజాసేవల పనితీరు మెరుగుపడేలా ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు, లక్ష్యాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నియామకాలతో జిల్లాల పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: