సచివాలయం : రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మూడు దశల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తుండగా మొదటి దశలో 55ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 16 ప్రారంభం కాగా మరో 39పార్కులకు శంఖుస్థాపన చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈ పార్కుల గ్రేడింగ్ ప్రగతి, 2025 పార్టనర్షిప్ సమిట్లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు సంబంధించిన కంపెనీల గ్రౌండింగ్ ప్రగతి, జిల్లా పరిశ్రమల మరియు ఎక్స్ పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాల నిర్వహణ, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అంశాలు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్, డాక్యూమెంట్ అప్లోడ్ ఏజెంట్ స్పేస్ అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
Read also: Electricity Charges : విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

MSME park should be made available in every constituency
175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రెండోదశ కింద 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3 ప్రారంభించగా 42 పార్కులకు శంకుస్థాపన జరిగిందన్నారు. మూడవ దశకింద ఈ నెలాఖరు లోగా 75ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉండగా 6పార్కులకు అవసరమైన భూమి ఎపిఐఐసికి అప్పగించగా మిగతా వాటికి సంబంధించి భూమి గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని ఆప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అందుబాటులోనికి తెచ్చేలా కలక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు.
రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ మాట్లాడుతూ జిల్లాల వారీ ఎంఎస్ఎంఈ పార్కుల ప్రగతిని వివరించారు. ఈ పార్కులు ఏర్పాటుకు సంబంధించి భూమి గుర్తింపు వేగవంతంగా పనులు జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాలోను జిల్లా పరిశ్రమలు మరియు ఎక్స్ పోర్టు ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ సమావేశాలను నిర్వహించాలని కలెక్ట ర్లకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీజిఎస్ సిఈఓ ప్రఖర్ జైన్, డ్రోన్ కార్పొరేషన్ సిఈఓ సూర్యమన్ పటేల్ పాల్గొన్నారు. వర్చువల్ ఎపిఐఐసి విసి అండ్ ఎండి అభిషిక్త్ కిషోర్, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: