ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లె గ్రామానికి చెందిన మల్లమ్మ (75) అనారోగ్యంతో శుక్రవారం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల వద్ద చికిత్స తీసుకున్న అనంతరం శరీరం పూర్తిగా సహకరించకపోవడంతో ఓపీ బ్లాక్ సమీపంలోని ఆరుబయట కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పూర్తయినప్పటికీ, బలహీనత ఎక్కువగా ఉండటంతో అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది.
Read also: CP Sajjanar: మద్యం తాగి వాహనం నడిపితే ఉపేక్షించేది లేదు

AP
రాత్రి సమయంలో తీవ్ర చలి కారణంగా వణుకుతూ మల్లమ్మ ఆస్పత్రి ఆవరణలోనే ప్రాణాలు విడిచారు. శనివారం ఉదయం ఆస్పత్రి సిబ్బంది ఆమెను గమనించి వైద్యులతో పరీక్షలు చేయించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రి ప్రాంగణంలోనే వృద్ధురాలి మృతి చోటుచేసుకోవడం స్థానికంగా కలచివేసే ఘటనగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: