ఆంధ్రప్రదేశ్ (AP) లోని నంద్యాల జిల్లా జలదుర్గ గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ యావదాస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళంగా ఇచ్చారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి రిజిస్ట్రేషన్ చేయించారు. పిల్లలు లేని ఈ దంపతుల దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Read Also: చేనేతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇతరులకు ఆదర్శం
ఈ రోజుల్లో ఒక్క రూపాయి దానం చేయాలన్నా ఆలోచించేవారి మధ్య, ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని దానం చేయడం విశేషం.గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారికంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వృద్ధ దంపతుల సేవా నిరతిని కొనియాడుతూ, గ్రామంలో ఊరేగించి ఘనంగా సత్కరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: