हिन्दी | Epaper

AP: శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

Rajitha
AP: శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

శ్రీశైలం: శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంకు 3లక్షల 25 వేల టన్నుల నకిలీ నెయ్యి సరఫరా అయిందని స్వచ్చాంద్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. గురువారం శ్రీశైలంకు (srisailam) చేరుకున్న ఆయన దేవస్థానం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరములో దేవస్థానంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తో అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. మే 2022 నుండి ఏప్రిల్ 2023 దాదాపు 11 నెలల పాటు నకిలీ నెయ్యిని సరఫరా చేసారని ఆరోపించారు. ఈ కాల వ్యవదిలో 11 కోట్ల రూపాయల విలువైన నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరి అయితే తిరుమల్లో పాపానికి వడిగట్టిందో అదే డైరీ నుండి రాజేష్ కార్పోరేషన్ అనే సంస్థ ద్వారా శ్రీశైల దేవస్థానoకు కూడా నకిలీ నెయ్యి సరఫరా చేసారని తెలియడం చాలా బాధ కలిగిందన్నారు.

Read also: Disabled Posts : ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

AP

Adulterated ghee was supplied to Srisailam: Chairman Pattabhiram

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం అనాడు హిందూ దేవాలయాలపై చేసిన దాడులు, వారు చేసిన అవినీతి, వారు చేసిన పాపాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపరుస్తున్నాయని వ్యాక్యనించారు. ఒక మతంపట్ల వారు చేసిన దాడి రధాలు తగలబెట్టడం, విగ్రహాలను ద్వంసం చేయడం ఇటువంటి పాపాలకు వడిగట్టడం స్వామివారి ప్రసాదాలకు ఉపయేగించే పదార్థాలు కూడా ఇటువంటి పాపాలు చేస్తారా అని అన్నారు

శివయ్య సన్నిదిలో ఈ రకమైన పాపాలు చేయడం

కొంచం కూడా భయం కూడా లేకుండా అక్కడ వేంకటేశ్వరస్వామివారి సన్నిదిలో ఇక్కడేమో శివయ్య సన్నిదిలో ఈ రకమైన పాపాలు చేయడం ఇవన్ని క్షమించరాని పాపాలు స్వామివారు అగ్రహనికి గత ఎన్నికల్లో గురి అయ్యారన్నారు. శ్రీశైల దేవస్థానంలో జరిగిన నకిలీ నెయ్యి సరఫరా గురించి వారు విచారణ జరుపుతారని అన్నారు. ప్రభుత్వ పరంగా చర్యలు కఠినంగా తీసుకుంటుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తూ ఎవరి మనోభావాలకు కూడా ఇబ్బంది కలుగకుండా పరిపాలన చేయడం జరుగుతుందని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870