हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

AP: పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన

Rajitha
AP: పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన

విజయవాడ : 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, పర్యాటక రంగ అభివృద్ధి, నిధుల కేటాయింపులపై వెలగపూడి సెక్రటేరియట్లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాఖాధిపతులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు అవసరమైన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడంతో పాటు వివిధ పర్యాటక ఉత్సవాల నిర్వహణకు రూ. 150 కోట్లు కేటాయించాలని మంత్రి దుర్గేష్ ఆర్థిక మంత్రిని కోరారు.

Read also: Garividi High School: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

AP

A proposal of ₹150 crore for tourism sector branding and marketing

విశాఖపట్నం, తిరుపతి నగరాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక తోడ్పాటు అందించాలని చర్చించారు. అదే విధంగా అన్ని జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు ఆర్థిక సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, సీబీడీడీ, శాస్కి మరియు పూర్వోదయ పథకాల ద్వారా వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, కనెక్టివిటీని మెరుగుపరచాలని నిర్ణయించామన్నారు. వివిధ వేదికలపై పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు అవసరమైన నిధులు కేటా యించి అనంతరం త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

ఈ సందర్భంగా 201419 కాలానికి సంబంధించిన పాత బకాయిల చెల్లింపులపై కూడా సానుకూలంగా చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పర్యాటక ఉత్సవాల అంశం చర్చకు వచ్చింది. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, సెక్రటరీ రోనాల్డ్ రాస్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు పర్యాటక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి దుర్గేష్.. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పీపీపీ విధానంలో సాగుతున్న ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన క్యాపిటల్ వర్క్స్, పార్కుల అభివృద్ధి, పర్యాటకుల భద్రతపై అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. తూర్పు భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యాటకం, సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పర్యాటక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. పూర్వోదయ క్రింద పర్యాటక సౌకర్యాలను అప్గ్రేడ్ చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు పర్యాటక సంబంధిత కార్యకలాపాల ద్వారా స్థానిక ఆర్ధిక వ్యవస్థలను పెంచడం, పర్యాటకాభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870