ఆంధ్రప్రదేశ్‌లో(Andhrapradesh budget) కూటమి ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ బడ్జెట్‌లో మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 చొప్పున వార్షికంగా రూ.18,000 అందించే అంశానికి నిధుల కేటాయింపులు ఉండనున్నాయని సమాచారం.
Read Also: Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

అలాగే, అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలకు సంబంధించి కీలక పథకాలకు భారీగా నిధులు కేటాయించనున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళకు నెలకు రూ.1500 అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
బడ్జెట్‌లో సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి
ఈ బడ్జెట్‌లో మహిళలు, రైతులు, యువత, మౌలిక వసతుల అభివృద్ధికి(Andhrapradesh budget) సంబంధించి ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: